పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పెద్దాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసీ మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ జాన్ మోజెస్, సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
* పెద్దాపురం టీడీపీ టికెట్‌పై సందిగ్ధత * సతమతమవుతున్న ఎమ్మెల్యే చినరాజప్ప * లోకేష్ దృష్టిలో గుణ్ణం, బొడ్డు పేర్లు * నేనే అభ్యర్థినని ప్రకటించుకుంటున్న రాజప్ప పెద్దాపురం: ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవు అన్నట్లు ఒకే పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇమడలేరు. పెద్దాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలోనూ ఇదే జరుగుతోంది. కాకపోతే ఇక్కడ ఇద్దరు కాదు. ముచ్చటగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప అయితే మరొకరు బొడ్డు తనయుడు వెంకటరమణ చౌదరి, ఇంకొకరు గుణ్ణం చంద్రమౌళి. ఫలితంగా పెద్దాపురంలో టీడీపీ మూడు ముక్కలైందని సర్వత్రా భావిస్తున్నారు. ఇద్దరు నాయకులూ టికెట్ కోసం ఆశిస్తున్నప్పటికీ మాకేం తెలియదంటూ మిన్నకుండిపోతున్నారు. తెర వెనుక మాత్రం చాపకింద నీరులా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప పరిస్థితి మాత్రం అలాలేదు. టికెట్ కోసం తీవ్రంగా సతమతమవుతూనే పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నారు. నేనే అభ్యర్థిని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే.. నాతో పార్టీ అధినేతే చెప్పారు నువ్వే అభ్యర్థివని.. ఇప్పుడు ఇవే మాటలు ఎక్కడిపడితే అక్కడ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. కానీ సోషల్ మీడియాతోపాటు పార్టీలోని ఇతరులు కూడా చిరనాజప్పకు ఈసారి టికెట్ కష్టమేనని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొస్తుందని ఆనోటా ఈనోటా ప్రచారం జరుగుతోంది. దాని కారణంగానే ఆయనెక్కడికి వెళ్లినా, ఎవరూ అడగకపోయినా నేనే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పెద్దాపురం టీడీపీలో ఏం జరుగుతోంది.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడే వచ్చే ఎన్నికల్లో కూడా పెద్దాపురం టీడీపీ టికెట్ నీకేనంటూ నాకు మాటిచ్చారని సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని పార్టీలోని ఇతర నాయకులతోపాటు కార్యకర్తలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తే ఆ విషయాన్ని చంద్రబాబే నేరుగా మీడియా ఎదుట బహిర్గతం చేసేవారని, అలా చెప్పలేదంటే టికెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇంకా స్పష్టత లేదంటున్నారు. ఇక బొడ్డు వెంకటరమణ చౌదరి విషయానికొస్తే తన అనుచరవర్గం నిర్ణయం మేరకూ, పార్టీ అధినేత ఆదేశాల మేరకూ మౌనంగా ఉన్నట్లు తెలుస్తుంది. గుంపులు కట్టకుండా పార్టీ కోసం పనిచేయి, పార్టీ నీకోసం ఎప్పుడేం చేయాలో చేస్తుందని చంద్రబాబు బొడ్డు తనయుడిని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అలాగే గుణ్ణం చంద్రమౌళి విషయానికొస్తే పార్టీలోని సీనియర్ నాయకులందరినీ తనదైన శైలిలో కలుపుకుపోతున్నారు. తన బలగాన్ని పెంచుకుంటూ ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ మౌళీకి ఇస్తారు కాబట్టి దూకుడు పెంచాడన్నట్టుగా టీడీపీ వర్గం కూడా భావిస్తుంది. లోకేష్ ఎదుట రెండు ప్రతిపాదనలు.. నారా లోకేష్ టేబుల్‌పై ఎమ్మెల్యే అభ్యర్థులుగా బొడ్డు, గుణ్ణం పేర్లు ప్రతిపాదనలున్నాయని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు. అయితే ఈసారి వైఎస్సార్ సీపీ బలంగా ఉండటం, పెద్దాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి యువకుడై ఉండటం వల్ల చినరాజప్పకు కాకుండా టీడీపీ నుంచి యువ నాయకులిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్‌కు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీలో బీవీఆర్ కంటే ఎక్కువగా గుణ్ణం చంద్రమౌళికి ప్రాధాన్యతనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీవీఆర్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనను ఏ కార్యక్రమానికి పిలవకపోవడం, ఆయన అభిప్రాయాన్ని తీసుకోకపోవడంపై బొడ్డు ఫ్యామిలీతో చినరాజప్పకు ఉన్న విరోధాన్ని తేటతెల్లం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.
* దవులూరిపై విరుచుకుపడుతున్న వ్యతిరేక వర్గం * పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు * ఆధారాలున్నాయంటూ ప్రచారం * నోరుమెదపని కోఆర్డినేటర్ * మౌనం అర్ధాంగీకారమా! * ప్లీనరీలో పరిష్కారమవుతోందా పెద్దాపురం: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాజకీయం పూటకో విధంగా మారుతోంది. పెద్దాపురం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై వ్యతిరేక వర్గం ఒకటే పనిగా విరుచుకుపడుతోంది. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సమాధానమిస్తున్నారు. ఒక పక్క పార్టీకి కష్టపడి పనిచేశామని కర్రి వెంకటరమణ, కరణం భాను, లింగం శివప్రసాద్, బీపెల్లి పండు, గోలి దొరబాబు, పాఠంశెట్టి నాగరాఘవ వంటి వారు పార్టీలోనే ఉంటూ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. పెద్దాపురంలోని గోలి రామారావు ఇంట్లో వీరు చేపట్టిన కార్యక్రమానికి సుమారు 60 నుంచి 80 మంది వరకూ సామాన్య కార్యకర్తలు మద్దతు తెలిపారు. దవులూరిని దించేయాలని ప్రతినబూనారు. దవులూరేమీ తక్కువ కాదుగా.. గోలి రామారావు ఇంట్లో పెట్టిన కార్యక్రమానికి ధీటుగా పెద్దాపురం అంబేడ్కర్ భవన్లో పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి పిలుపు మేరకూ పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు హాజరయ్యారు. అందరూ మంచి పదవులు ఉన్నవారే హాజరయ్యారు. కర్రి వెంకటరమణనే టార్గెట్‌గా పెట్టుకుని వ్యాఖ్యలు చేశారు. నెక్కంటి సాయి, తదితరులైతే నేరుగా మేమేం గాజులు తొడుక్కోలేదు, దవులూరిని తరిమికొడతానంటావా అవసరమైతే నీదగ్గరకే వస్తామంటూ ధ్వజమెత్తారు. బెల్లం ఉన్న చోటే చీమలు తిరుగతాయన్నట్టు ప్రస్తుతం దవులూరి చుట్టూనే ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. సమాధానమివ్వని నెక్కంటి.. అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు దవులూరిని బాగా వెనకేసుకువచ్చారు. అయితే అదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు మాట్లాడుతూ వ్యతిరేక వర్గాన్ని కలుపుకుపోతామని అర్ధంకాని సమాధానమిచ్చారు. అనంతరం నెక్కంటిని మీడియా ప్రశ్నించగా దవులూరిని వెనకేసుకురావడం, వ్యతిరేకవర్గంపై సీరియస్‌గా మాట్లాడటం తప్ప సరైన సమాధానం ఇవ్వలేదు. ఇంతలోనే పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో సమాధానమివ్వలేక జైజగన్, జై దవులూరి అంటూ నినాదాలు చేస్తూ పార్టీ నేతలతో సహా నెక్కంటి కూడా అక్కడి నుంచి జారుకున్నారు. దవులూరికి సమాధానమిచ్చే ధైర్యం లేదా.. మౌనం అర్ధాంగీకారమని మన పెద్దలు చెబుతుంటారు. వ్యతిరేక వర్గం దవులూరిపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా ఆయన పట్టించుకోనట్టు వ్యవహరిస్తుంటారు. కానీ వ్యతిరేక వర్గంలో ఉన్న బీపెల్లి పండు పోస్టింగులపై సామర్లకోట ఎస్సీ నాయకుడు ఊబా జాన్మోజెస్తో ప్రెస్‌మీట్ పెట్టించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే లింగం శివప్రసాద్ తలపెట్టిన దవులూరిపై తిరుగుబాటు కార్యక్రమానికి సమాధానంగా పెద్దాపురంలో అంబేడ్కర్ భవన్ అంకితం కార్యక్రమం పేరుతో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో మరో కార్యక్రమం చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించారు. ఇటీవల గోలి రామారావు స్థాయికి తగ్గట్టుగా నెక్కంటి సాయితో మరో కార్యక్రమం చేపట్టి తనదైన శైలిలో సమాధానమిప్పించారు. అంతేకానీ ఆయన మాత్రం నేరుగా ఎన్నడూ సమాధానమివ్వలేదు. భాను దగ్గర ఆధారాలున్నాయా.. లేవా.. దవులూరి అక్రమాలకు సంబంధించి మా దగ్గర ఆధారాలున్నాయని మీడియా ముందు కరణం భాను ప్రస్తావించారు. వాటిని మాకివ్వగలరా అని మీడియా అడగడంతో అధిష్టానానికే ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎందుకని వాటిని అధిష్టానానికి ఇవ్వలేదు, ఎందుకు బయట పెట్టడం లేదని పాత్రికేయులు ప్రశ్నించడంతో దానికి సమయం ఉందని చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే అసలు ఆధారాలున్నాయా లేవా అనే సందేహం కూడా మీడియాకు తట్టింది. ఈ వ్యతిరేకవర్గం నాలుగు రోజుల క్రితమే కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కురసాలను కలిసి పూసగుచ్చినట్లు పార్టీ పరిస్థితిని వివరించారు. దీనిపై అందరూ ఓసారి భేటీ అవుదామని వారు సమాధానమిచ్చారు. అప్పటివరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దన్నారు. ప్లీనరీతో చెక్ పడుతోందా.. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించే ప్లీనరీ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అయితే ఈ మీటింగుకు వ్యతిరేకవర్గం హాజరవుతుందా అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తుంది. ఒకవేళ హాజరైతే దవులూరిని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతారా లేదంటే మిన్నకుండిపోతారా అనే సందేహం వెంటాడుతోంది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఈ ప్లీనరీ సమావేశంతో తొలగిపోతాయా లేక ఇంకా ముదిరిపోతాయా అని అందరూ ఆలోచిస్తున్నారు.
పెద్దాపురం: బచ్చు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఫౌండేషన్ చైర్మన్ బచ్చు అవినాష్ దేవీచంద్ర పేర్కొన్నారు. పెద్దాపురంలోని బచ్చు ఫౌండేషన్ అసెంబ్లీ హాలులో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఫౌండర్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీ కూడా సేవా కార్యక్రమాలలో చొరవ చూపించి ప్రజలకు మేలు చేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రిపోర్టును మీడియా ముఖంగా వెల్లడించారు.
* 11వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె * పెద్దాపురంలో హోరెత్తిన నినాదాలు పెద్దాపురం: తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పెద్దాపురం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతినబూనారు. నిరవధిక సమ్మెలో భాగంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీని ప్రారంభించారు. అంగన్వాడీల హక్కులను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులతోపాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పెద్దాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసీ మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ జాన్ మోజెస్, సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఒక వ్యక్తి బరువు పెరగడానికి అతనికి ఉన్న ఆవేశమే ప్రధాన కారణమని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ అనే సంస్థ నిర్వహించిన తాజా అధ్యయంలో వెల్లడైంది. ముఖ్యంగా రోజువారీ జీవితంలో అత్యంత జాగరూకతతో, సహనంతో ఉండేవారి బరువులో పెద్ద మార్పులేవీ కనిపించలేదని ఈ సంస్థకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. వ్యక్తిత్వ విలక్షణతకు అధిక బరువుకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఈ పరిశోధకులు మొత్తం 1,988 మందిని ఎంపిక చేసి వారి జీవన విధానం, బరువు, ఆహారపు అలవాట్లపై 50 యేళ్ళ పాటు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వ్యక్తుల వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరగడానికి వారిలో ఉండే ఆవేశమే కారణమని తేల్చారు. వ్యక్తి వయస్సుతో పాటు బరువు పెరగకుండా ఉండాలంటే ఆవేశం తగ్గించుకుని, సమతుల్య ఆహారం తీసుకుంటూ రోజులో కొంత సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఏంజిలినా సూచించారు. అయితే, అవేశపరులు పనులు చేయాడానికి ఇష్టపడరని, కానీ, తినడానికి, విందు భోజనాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతారని పేర్కొంది. నెమ్మదస్తులు ఒక రోజు ఆహారం ఎక్కువగా తీసుకున్నా తర్వాత రోజు తక్కువగా తీసుకుంటారని, ఆహరం తీసుకోవడంలో నియంత్రణ పాటిస్తారని ఏంజిలినా తెలిపారు.
మీ కేశాల సమస్యలను త్రోలగించటానికి మొదటగా వెంట్రుకల యొక్క పరిస్థితిని తెలుసుకోవాలి. సాధారణంగా వెంట్రుకల సమస్యలను బట్టి వాటిని మూడు రకాలుగా విభజించారు. మొదటిది-జిడ్డుగా ఉండే వెంట్రుకలు, రెండవది-పొడి వెంట్రుకలు మరియు చివరది-సాధారాణ వెంట్రుకలు, ఇక్కడ జిడ్డు మరియు పొడి వెంట్రుకల గురించి తెలుపబడింది. జిడ్డుగా ఉండే వెంట్రుకలు మీ తలపై చర్మంలో ఉండే గ్రంధులు ఉత్తేజానికి గురయ్యి, అధిక నూనెలను ఉత్పత్తి చేయటం వలన జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగా ఉండే కేశాలు అతుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని సార్లు అలా కనిపించదు కుడా, కానీ ఇది వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళిని అధికంగా గ్రహిస్తుంది. కావున కేశాలు తొందరగా దుమ్ముపట్టి, తలపై చర్మానికి మరియు జుట్టుకి చాలా ఆరోగ్య సమస్యలను తెస్తుంది. ఈ విధంగా వెంట్రుకల మధ్య చుండ్రు ఏర్పడి జుట్టు రాలటానికి కారణం అవుతుంది. నిర్వహణ క్రమంగా హెన్న ఉన్న షాంపూతో కడగాలి. దీని వలన వెంట్రుకల రంగు ప్రభావితం అవకుండా ఉంటుంది, అధికంగా ఉన్న ఆయిల్'ని గ్రహించుకుంటాయి, వెంట్రుకలకు తగినంత విధంగా పొడితత్వాన్ని చేకూరుస్తాయి. మీ వెంట్రుకలకు నూనెలను వాడకూడదు, వెంట్రుకలకు బలాన్ని అందించే టానిక్'లను వాడండి. ఇది మీ జుట్టుకి బలాన్ని చేకురుస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండానికి హెన్నాని వాడండి. పొడి వెంట్రుకలు పొడిగా ఉండే జుట్టు, తలపై ఉండే చర్మ గ్రంధులు నూనెలను స్రవించక లేదా ఉత్పత్తి చేయకపోవటం వలన వెంట్రుకల పొడిగా మారతాయి. కావున జుట్టు రసాయనాల వలన, సూర్యకాంతి, దుమ్ము, ధూళి వలన జుట్టు పాడయిపోతుంది. పొడి జుట్టు వలన సమస్యలు పొడిగా ఉండే జుట్టు వలన తలపై చర్మం కూడా చుండ్రుకి ప్రభావితం అవుతుంది. ఇది వెంట్రుకల మొత్తానికి విస్తరించి, చూడటానికి నాణ్యత రహితంగా కనపడుతుంది. అపుడపుడు చుండ్రు ధరించే దుస్తువుల పైన కూడా పడవచ్చు. వెంట్రుకల కణాలు గరుకుగా మారి, ప్రకాశరహితంగా మారుతుంది. వెంట్రుకలు ఎక్కువగా పొడిగా మారటం వలన జుట్టు పాడైపోయి మధ్యలో తెగిపోతుంది.
సైడ్ ప్లాంక్ నేలపై లేదా మ్యాట్ పై ఎడమ వైపు పడుకోండి. కొంచెం కాళ్ళను పాదల దగ్గర వెడం చేసి రెండు పాదాలు నేలపై ఉండేలా చుడండి. ఎడమ చేతి ని మోచేతి దగ్గర వంచి నేలపై ఉంచి మెల్లగా నడుము ప్రాంతాన్ని పైకి లేపండి. పడాల దగ్గరనుంచి భుజాల వరకు ఒకే లైన్ పై ఉండేలా చుడండి. ఇలా కొద్ది సేపు ఉంచి కిందకు దించేయండి. ఇలా కుడు వైపు కూడా చేయనది. రెండు కలిపి 5 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తూ 2/3 సెట్లు చేయండి. ఫ్లాట్ బ్యాక్ నడుమును గోడకి ఆనిస్తూ నేలపై సరిగా కూర్చోండి. కళ్ళను భుజలకంటే కొంచం వేదం చేసి మోకాళ్ళ దగ్గర కొంచం వంచండి. ఇప్పుడు చేతులను కాల్ మధ్యలోంచి నేలపై ఆన్చండి. ఇప్పిడు చేతులను నేలపై ఒత్తుతూ కాళ్ళను గాలిలోకి లేపండి. ఇలాగ 10 సార్లుగ ౩ సెట్లు చేయండి. పెల్విక్ స్కూప్ నేలమీద వేల్లకీల పడుకోండి. కాళ్ళను మోకాళ్ళ దగ్గర వంచి, చేతులను వెడంగ పెట్టండి. ఇప్పుడు కూడా పాదాన్ని లేపి ఎడమ కాలు పై పెట్టండి. ఇప్పుడు నిదానంగా మీ నడుము బాగాన్ని పైకి లేపండి. ఇలా కొద్ది సేపు ఉంచి కిందకి దించండి. ఇలా 10 సార్లు గ 2 లేదా 3 సెట్ లు చేయండి.
మా దగ్గర మీరు కొన్న ఫోన్ చెడిపోతే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. సమాచారం ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను పరిశీలిస్తాం... అది రిపేర్ కావడానికి సమయం పడితే రిపేర్ అయ్యేవరకు ఒక ఫోన్ వాడుకోవడానికి ఇస్తామంటూ చిన్న సెల్‌షాపులు, షోరూంలు ఈ వారం నుంచి ప్రచారం ప్రారంభించాయి. సెల్ చెడిపోతే అప్పటివరకు ఫోన్ సేవలకు అవాంతరం అవుతుందని, అందువలన వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే పెద్ద షోరూంలలో ఈ సదుపాయం లేదు. చిన్న షాపుల వారు మాత్రమే ఈ ఆఫర్లు పెట్టారు. పెద్ద షో రూంలలో ధరల తగ్గింపు ప్రభా వాన్ని తట్టు కోవడానికే ఈ ఆఫర్లు ప్రకటించారు. దీంతో వినియోగ దారులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకొని వారిని సంతృప్తిని పరచడం ద్వారా వ్యాపార విస్తృతి కోసం దీనిని ప్రకటిస్తున్నారు.
అనకాపల్లి: ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో బెల్లం ధరలు రోజు రోజుకి పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీన ఒకటోరకం వంద కిలోలు రూ.3110 పలకగా మధ్యరకం రూ. 2770లకు పలికింది. నల్లబెల్లం రూ.2520లకు పలికాయి. 10న ఒకటోరకం రూ.3060, మధ్యరకం రూ.2740, నల్లబెల్లం రూ. 2490లకు పడిపోయింది. మంగళవారం ఒకటో రకం రూ.3000లకు పడిపోగా మధ్యరకం రూ. 2710కి తగ్గిపోయింది. నల్లబెల్లం రూ.2530కి పెరిగింది. వాస్తవానికి ఒకటో రకం బెల్లం దిమ్మలు తక్కువగా వస్తుంటాయి. దాని తరువాత రకాన్నే ప్రమాణికంగా తీసుకోవాలి. ఆతరువాత రకమైతే రూ.2860లకు పలికినట్టు వర్తకులు చెబుతున్నారు. ఇతర మార్కెట్ల్లో ధరలు తక్కువగా ఉండడంతో వాటి ప్రభావం అనకాపల్లి మార్కెట్‌పై కూడా పడుతుందని వర్తకులు చెప్పారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక బెల్లాలు ఇతర రాష్ట్ర వర్తకులకు రవాణాతో సహా కలుపుకొని తక్కువ రేటుకు అమ్మకాలు చేయడంతో అనకాపల్లి మార్కెట్‌కు ఆర్డర్లు తగ్గుతున్నాయని వర్తకులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో బెల్లం ధరలు పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా చెరకు పంటకు తెగుళ్లు సోకి ఆర్థికంగా నష్టపోతున్న సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగల పర్వదినం సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకకు అనకాపల్లి బెల్లా న్ని కొనుగోలు చేసి ఉంటే రైతులకు కొంతైనా గిట్టుబాటు ధర లభించేదని చెరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు తెలిపారు.
అమరావతి: ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేయనుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ప్రతి ఏటా 3 లక్షల కార్లను కియా మోటార్స్ తయారు చేయనుంది. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కియా కంపెనీ సిద్ధమైంది. కియో మోటార్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కార్లను రోడ్డుపైకి తెచ్చేలా కియా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డైనమిక్ సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు మంచి చేయాలన్న గట్టి ఆశయం ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధించగలరని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు.
భార్య చెడు మార్గంలో పయనించటాన్ని గుర్తించిన భర్త మందలించాడు. పెద్ద మనుషులతో చెప్పించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆ భర్త బందువులకు రూ. పది వేల సుఫారి ఇచ్చి ఆమెను హత్య చేయించాడు. ఇదీ హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తాండాకు చెందిన 26 యేళ్ల వివాహిత అత్యాచారం, హత్య వెనుక ఉన్న మిస్టరీ. ఈ హత్య కేసును మెదక్ రూరల్ పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. వివాహిత హత్య కేసు వివరాలను శుక్రవారం మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.... హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండా పంచాయతీకి చెందిన 26 యేళ్ల వివాహిత ఈనెల 17న హత్యకు గురయింది. భర్త ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కేసును వివాహేతర సంబంధాల కోణంలో విచారించిన పోలీసులు భార్యాభర్తల మధ్య గతంలో జరిగిన గొడవలపై దృష్టిపెట్టారు. మృతురాలి భర్త బతుకుదెరువు కోసం సింగపూర్‌కు ఏడాది క్రితం వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరిపింది. భర్త ఆరుమాసాల్లోపు తిరిగి వచ్చి ఓ ఇటుక బట్టి ట్రాక్టర్లో కూలీగా చేరాడు. ఆ క్రమంలో భార్య ప్రవర్తలో మార్పును గమనించాడు. తాండాలోని కుల పెద్దల పంచాయతీ పెట్టి మందలించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడితో కలిసి తనను భార్య ఎక్కడ అంతమొందిస్తోందన్న భయం అతన్ని వెంటాడింది. ఎలాగైనా ఆమెను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ నడిపే ముడావత్ రూప్ సింగ్ సాయాన్ని కోరాడు. తన భార్యను హత్య చేయాలని కోరాడు. హత్యకు మొదట సముఖంగా లేని రూప్సింగ్... రూ. పది వేలు ఇస్తాననటంతో అంగీకరించాడు. హత్యకు పథకం వేసి రూప్సింగ్...తన తోడల్లుడు ముడావత్ మదన్ సహకారం తీసుకున్నాడు. ఈనెల 17న మృతురాలిని పథకం ప్రకారం రూప్సింగ్, మదన్ మృతురాలిని బైక్‌పై ఎక్కించుకొని జిల్లా కేంద్రంలోని ఓ సినిమా ధియేటర్లో ఫస్ట్ షో సినిమాను చూశారు. అనంతరం ఓ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి అవుసులపల్లి గ్రామ శివారులోని ఓ చెట్టు కిందకు వెళ్లారు. పథకం ప్రకారం వచ్చిన రూప్ సింగ్, మదన్ తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని ఆమెకు తాగించారు. మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చీరతోనే ఉరి వేసి హత్య చేశారు. భర్త... సినిమాకు వెళ్లిన దగ్గర నుంచి పథకం అమలవుతున్న తీరులో ప్రతీ విషయాన్ని ఫోన్ ద్వారా తెలుసుకుంటునే ఉన్నాడు. హత్యకు ముందు ఫోన్ చేసి చంపారా.? లేదా..? అని అడిగాడు. మరో పదిహేను నిమిషాల్లో చంపేస్తున్నాం అని వారు చెప్పారు. హత్య చేశాక దగ్గర్లోని చౌరస్తా వద్ద ముగ్గురు కలుసుకొని ఇంటికి వెళ్లిపోయారు. తన భార్య ఇంటికి రావటంలేదని చుట్టు పక్కల వారిని భర్త నమ్మించే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు ఉదయం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారాన్ని సేకరించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన పాత్ర భర్త వహించినా హత్య చేసింది మాత్రం రూప్సింగ్, మదన్ మాత్రమే.. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్, మెదక్ రూరల్, హవేళిఘణాపూర్ ఎస్ఐలు లింబాద్రి, శ్రీకాంత్, తాహేర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మల్టీలెవల్ మోసానికి పాల్పడి, దేశవ్యాప్తంగా 17 లక్షల మంది అమాయకులను మోసం చేసి, రూ. 5 వేల కోట్లు కొల్లగొట్టిన ఘరానా కేటుగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఈ ఏడాది మార్చి 12న ఈ మోసం వెలుగులోకి వచ్చింది. భారీ స్కామ్‌ను నిందితుడు తన భార్య, కొడుకు సహాయంతో చేయడం గమనార్హం. అతడి భార్య పోలీసులకు గతంలో పట్టుబడింది. పరారీలో ఉన్న తండ్రీకొడుకులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి బ్యాంకుల్లో నిల్వ ఉంచిన డబ్బు సహా మొత్తం రూ. 389 కోట్లు ఫ్రీజ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సెక్టార్ 63 కేంద్రంగా ఈ బిజ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ను పవన్ మల్హాన్ అనే వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్‌గా, అతడి భార్య అనితా మల్హాన్ డైరెక్టర్‌గా 2001లో ఏర్పాటు చేశాడు. వారి కుమారుడు హితిక్ మల్హాన్ కంపెనీ వ్యవహారాలు చూస్తుంటాడు. సుమారు 18 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ దందాలో పిరమిడ్ స్కీమ్‌ను అమలు చేశారు. వారి కంపెనీలో చేరిన ఒక సభ్యుడు ఎడమ, కుడి అన్నట్లుగా మరో ఇద్దరిని చేర్పించాలి. చేరిన వారు మరో ఇద్దరిని, లేదా ముగ్గురిని చేర్పిస్తూ వెళ్లాలి. ప్రతి సభ్యుడు రూ. 16,821 చెల్లించి తన కింద మరో ఇద్దరు ముగ్గురు సభ్యులను చేర్పించాలి. చెల్లించిన నగదుకు ఏదో ఒక వస్తువును మార్కెటింగ్ చేసినట్లు ఉండాలనే ఉద్దేశంతో వస్త్రాలు (కట్‌పీస్)తోపాటు ఎలకా్ట్రనిక్ లెర్నింగ్ పేరిట ఆన్లైన్ కోర్సుల నిమిత్తం లాగిన్ ఐడీ పాస్వర్డ్ ఇస్తారు. వస్తువుల మార్కెటింగ్ ముసుగులో ఎంల్ఎం స్కీమ్‌లను నిర్వహించి 17 లక్షల మందిని మోసం చేశారు. ఈ క్రమంలో రూ. 5 వేల కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి స్కీమ్‌లలో చేరిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే కొద్దో గొప్పో ఆదాయం వచ్చినప్పటికీ 95 శాతం మంది దారుణంగా దగా పడ్డారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ లెర్నింగ్ పేరిట ఆన్లైన్ కోర్సులు.. హాలిడే ప్యాకేజీలు, టెక్స్టైల్స్, రకరకాల వస్తువులు మార్కెటింగ్ అంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమై ప్రకటనలతో అమాయకులను నమ్మించసాగారు. అరచేతిలో వైకుంఠం... 21వ శతాబ్దపు వ్యాపారమంటూ.. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు... కానీ చావడం పెద్ద నేరమని వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అరచేతిలో వైకుంఠం చూపించారు. కళ్లముందు కోటీశ్వరులు అయినట్లు కలల ప్రపంచాన్ని చూపించారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అంటూ బురిడీ కొట్టించారు. ప్రమోటర్‌గా చేరిన వారు కొత్త వారిని నియమించగానే రిప్రజెంటేటివ్‌గా మారిపోతాడు. అతను మరో ఇద్దరిని చేర్పిస్తాడు. ఇలా చెయిన్ పెరుగుతూ పోతే లక్షలు, కోట్ల రూపాయలు వస్తాయని కళ్లముందే కోటీశ్వరులు అయినంత బిల్డప్ ఇచ్చారు. ఒకరు కంపెనీలో చేరి డబ్బులు చెల్లించగానే అతడికి పదివేల పాయింట్లు వస్తాయి. మరో ముగ్గురిని అతడు చేర్పించగానే లెగ్‌లు పెరిగి పాయింట్ల సంఖ్య 30 వేలకు చేరుతుంది. ఆ తర్వాత అతడికి కమీషన్ రూపంలో రూ. 2,700 వస్తుంది. ఈ క్రమంలో మెంబర్లు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. దానిద్వారా వారు ఇచ్చే కమీషన్ కూడా పెరుగుతుంది. ఇలా దాని విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని నమ్మించి ముగ్గులోకి దించుతారు. ఎక్కువ మందిని చేర్పించిన వారికి సిల్వర్, డైమండ్, డిప్లొమాట్, సిల్వర్ డిప్లొమాట్, గోల్డ్ డిప్లొమాట్, డైమండ్ డిప్లొమాట్, అంబాసిడర్, సిల్వర్ అంబాసిడర్, గోల్డ్ అంబాసిడర్, డైమండ్ అంబాసిడర్, చైర్మన్ సర్కిల్ అనే స్థాయిలను చూపించి ఊహా లోకంలో విహరింపచేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా తదితర ప్రధాన నగరాల్లో మల్టీలెవల్ మోసాలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు.
చెన్నై: చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి దళిత మహిళా మేయర్‌గా ప్రియా రాజన్ శుక్రవారం ఏకగ్రీవమయ్యారు. ఈమేరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మేయర్ పదవికి ప్రియా రాజన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. తాజా ఎన్నికల్లో తిరువికా నగర్‌లోని 74వ వార్డు నుంచి డీఎంకే పార్టీ తరపున ఆమె గెలుపొందారు. కార్పొరేషన్‌కు ఎన్నికైన యువ కార్పొరేటర్లలో ఆమె ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ చెన్నై మేయర్ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి. అతిచిన్న వయసులో చెన్నై మేయర్ పదవిని చేపట్టిన మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు.