బచ్చు ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం

Published: 28-12-2023

పెద్దాపురం:  బచ్చు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఫౌండేషన్ చైర్మన్ బచ్చు అవినాష్ దేవీచంద్ర పేర్కొన్నారు. పెద్దాపురంలోని బచ్చు ఫౌండేషన్ అసెంబ్లీ హాలులో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఫౌండర్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీ కూడా సేవా కార్యక్రమాలలో చొరవ చూపించి ప్రజలకు మేలు చేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రిపోర్టును మీడియా ముఖంగా వెల్లడించారు.