మహాసేన రాజేష్ అరెస్ట్ ?
Published: 04-03-2022

మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ సరిపెళ్లను ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు చేసినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది రాజేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రాజేష్ మహాసేన కొన్ని గంటల క్రితం ఫేస్‌బుక్ వేదికగా మాట్లాడుతూ ప్రస్తుతం నన్నెవరూ అరెస్టు చేయలేదని, రెండేళ్ల క్రితం పేపర్ క్లిప్పింగును కొంతమంది ప్రత్యర్థులు కావాలనే పోస్టు చేసి ఆనందపడుతున్నారని వ్యాఖ్యానించారు. తన అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Share this on your social network: