వెనక్కి తగ్గేదెలే!

Published: 22-12-2023

* 11వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

* పెద్దాపురంలో హోరెత్తిన నినాదాలు

పెద్దాపురం: తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పెద్దాపురం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతినబూనారు. నిరవధిక సమ్మెలో భాగంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీని ప్రారంభించారు. అంగన్వాడీల హక్కులను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులతోపాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.