Published: 02-12-2018
పోలవరం సందర్శన యాత్ర

గుంటూరు: వేమూరు నియోజకవర్గం నుంచి 1500 మంది రైతులు 25 బస్సులలో ఆదివారం పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రకు బయలుదేరారు. ఈయాత్రను రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టును ప్రతిఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని, సీఎం చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి అన్నారు. అలాగే ప్రాజెక్టుపై కేంద్రప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని ఆయన అన్నారు
