Published: 01-12-2018

పాలకొండలో జగన్ పాదయాత్ర

పాలకొండ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 309వ రోజు పాదయాత్రను జగన్ పాలకొండ నుంచి ప్రారంభించారు. పాలకొండ నుంచి గోపాలపురం, మంగళపురం క్రాస్‌, నాగావళి బ్రిడ్జ్‌ మీదుగా బొడ్డవలస క్రాస్‌, సంకిలి, చిన్నయ్యపేట, మజ్జిరాముడు పేట మీదుగా ఉంగరాడమెట్ట వరకు జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది.