Published: 29-11-2018

బాలసాయికి కన్నీటి వీడ్కోలు

ఆధ్యాత్మిక గురువు, భగవాన్‌ బాలసాయిబాబా అంత్యక్రియలు బుధవారం కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో ఉన్న శ్రీనిలయంలో జరిగాయి. కుటుంబ సభ్యులు ప్రకటించిన మేరకు శ్రీనిలయంలో బాబా దేహానికి ఖనన సంస్కారాలు నిర్వహించి మహాసమాధి చేశారు. బాబా సోదరుడు రమేశ్‌, సోదరీమణులు క్రిష్టవేణి, ఇందిర, ఇతర కుటుంబ సభ్యులు, బాలసాయి సెంట్రల్‌ ట్రస్టీ టి. రామారావు, బాబాకు సన్నిహిత భక్తులు దర్శించుకున్నారు. బాలసాయిబాబా అంతిమ సంస్కరణలకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మదనగోపాల్‌ తదితరులు హాజరయ్యారు.