Published: 23-11-2018

రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నల్లగొండ: జిల్లాలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా... భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానాల సిబ్బంది ఆయా ఏర్పాట్లు చేశారు.