Published: 19-11-2018
బీజేపీ భూ పరిరక్షణ ఆందోళనలు

‘‘రాష్ట్రంలో టీడీపీ పాలనలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయి. డబ్బులు తీసుకొని అవసరానికి మించి పలు కంపెనీలకు భూమిని ధారాదత్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. 24 వరకూ వివిధ రూపాల్లో ఆందోళనలను కొనసాగిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి తెలిపారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. ఎంపీ హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో భూపరిరక్షణ పేరుతో సాగే ఆందోళనల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
