Published: 17-11-2018

పార్వతీపురంలో నేడు వైఎస్ జగన్‌ పాదయాత్ర

విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర నేడు పార్వతీపురంలో జరగనుంది. నర్సింహపురం, వసుంధరనగర్‌, యర్రా కృష్ణమూర్తి కాలనీ మీదుగా పార్వతీపురం మెయిన్‌‌రోడ్డులో పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు పార్వతీపురం పాతబస్టాండ్ దగ్గర జరిగే బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు. కాగా... విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తిదాడి తర్వాత జగన్ పాదయాత్ర నిర్వహించినప్పటికీ బహిరంగ సభల్లో ప్రసంగించలేదు. ఈరోజు సాయంత్రం జరిగే సభలో జగన్ ఏం ప్రసంగిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.