Published: 13-11-2018

ఫిబ్రవరిలోనే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావొచ్చని ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారని వెల్లండిచారు. రేపటి నుంచి దశలవారీగా రాష్ట్రానికి వీవీ ప్యాడ్‌లు తీసుకొస్తామని చెప్పారు. ఈవీఎంల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు భెల్ కంపెనీకి పంపిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 కోట్లు అని పేర్కొన్నారు.