Published: 12-11-2018
కానిస్టేబుల్ నోటిఫికేషన్ నేడే

పోలీస్ శాఖలో కొలువు పొందాలని కలలుగనే నిరుద్యోగులకు ఏపీ పోలీస్ నియామక బోర్డు 2,803 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సోమవారం ప్రకటన జారీ చేయనుంది. ఇది సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. వివరణాత్మక నోటిఫికేషన్‌తోపాటు సోమవారం మధ్యాహ్నం నుంచే వెబ్‌సైట్ నుంచి దరఖాస్తుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. డిసెంబరు 7 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు డిసెంబరు 24 నుంచి జనవరి 4 వరకు ఆన్‌లైన్‌లోనే హాల్ టికెట్లను అందించనున్నారు. జనవరి 6న 100 మార్కులకు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు ఓసీ, బీసీలు అయితే రూ.300, ఎస్సీ, ఎస్టీలైతే.. రూ.150 రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు.
పోస్టులు ఇవీ..
సివిల్ పోలీసు కానిస్టేబుల్ 1,600, ఏఆర్ కానిస్టేబుల్ 300, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300, ఫైర్‌మెన్ 400, జైలు వార్డర్(పురుషులు) 100, జైలు వార్డర్(మహిళలు) 23, డ్రైవర్లు 30, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 50
