బాబు, పోలీసుల కనుసన్నల్లోనే జగన్‌పై దాడి

సీఎం చంద్రబాబు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే మా పార్టీ అధినేతపై క త్తితో దాడి జరిగింది. జగన్ మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని చెప్పడం వల్లే అతనికి భూమిపై నూకలు మిగిలాయి. లేకపోతే మరో ఘోరం జరిగిపోయేది’’ అని వైసీపీ నేత బొత్స సత్య నారాయణ అన్నారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మైత్రిని చూస్తుంటే 420, 840లు పొత్తు పెట్టుకున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపరుడంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏడాది కిందట చార్జిషీట్ విడుదల చేసిం ది. ప్రజల నుంచి సంతకాలు కూడా సేకరించింది. అలాంటి పార్టీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ‘దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని, మోదీ నుంచి దేశాన్ని రక్షించేందుకే కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకుంటున్నామని చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పందంగా ఉంది. తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో పార్టీని కాపాడుకోవడానికే కాంగ్రెస్ పంచన చేరాడు’’ అని బొత్స అన్నారు. చిత్తూరు జిల్లా బీ కొత్తకోటలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ‘‘వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రథమ ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిందును కోరతాం. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రె్‌సలో మొదలైంది. నేడు మళ్లీ అదే పార్టీతో వెళుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అసలు రూపం బయట పడింది. బాబు ఓటుకు నోటు కేసులోనూ మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని రోజా అన్నారు.
