Published: 03-11-2018
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్

అమరావతి: బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ధీటుగా స్పందించారు. బీజేపీని గద్దెదించడానికి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటును పవన్‌కల్యాణ్ ఫ్లాప్ షో అనడం సరికాదంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని సినిమాతో పోల్చడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు.
