Published: 31-10-2018
విజయవాడలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సైకిల్ ర్యాలీ

విజయవాడ: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా విజయవాడ నుంచి అమరావతికి ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భారీ సైకిల్ ర్యాలీ చేపట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ చేస్తున్నామని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంమాండెంట్ కెఎన్.రావు అన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సచివాలయం వరకు 50 కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ కొనసాగనుంది.
