Published: 29-10-2018

కలకలం రేపుతున్న మావోయిస్టు బ్యానర్లు

విశాఖపట్నం: విశాఖ జీకే వీధి మండలం ఆర్‌.వి.నగర్‌ ఏపీఎఫ్‌డీసీ కార్యాలయం సమీపంలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఏపీఎఫ్‌డీసీ ఆఫీసు గేటుకు బ్యానర్లు, పరిసరాల్లో భారీగా కరపత్రాలు వెలిశాయి. కాఫీ తోటలపై పూర్తి హక్కు గిరిజనులదే అని, కాఫీ బోర్డును తరిమికొట్టాలని, అలాగే బాక్సైట్‌ తవ్వకాలకు యత్నిస్తున్న టీడీపీ, బీజేపీని తరిమికొట్టాలంటూ బ్యానర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు.