Published: 28-10-2018
అడ్డంగా దొరికిన జగన్‌మోదీరెడ్డి

కోడికత్తి డ్రామాలో ఎ1 ముద్దాయి జగన్‌మోదీరెడ్డి అడ్డంగా దొరికిపోయారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘అడ్డంగా దొరికిపోయిన త ర్వాత కూడా జగన్‌మోదీరెడ్డి దొంగ... దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, చానల్‌లో డబ్బా కొట్టుకొన్నంత మాత్రాన కోడికత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు. కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తానని పోలీసులను బెదిరిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ, వ్యవస్థలపై నమ్మకం లేదంటూ రాష్ట్ర ప్రజలను కించపర్చేలా మాట్లాడటం దారుణం. ఢిల్లీలో రాసిన కథ విశాఖ విమానాశ్రయంలో రక్తికట్టింది. ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య, కొండగట్టు ప్రమాదం, తితలీ తుఫాను ఘటనల్లో బాధితులకు కనీసం సానుభూతి తెలపని నాయకులు... కోడికత్తి వార్త కూయక ముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకూ విలేకరుల సమావేశాలు పెట్టారు. కుట్ర రాజకీయం అనడానికి ఈ ఆధారాలు సరిపోవా’ అని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించారు.
