Published: 21-10-2018

రౌడీలు ఏపీ బయటే ఉండా

విజయవాడ: రౌడీలు ఏపీ బయటే ఉండాలని, పోలీసుల త్యాగాలకు నిదర్శనమే అమరవీరుల సంస్మరణ దినం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ... ఎర్రచందనం సంపదను ప్రాణాలు అడ్డేసి పోలీసులు కాపాడారని, అలాగే విజిబుల్ పోలీసింగ్.. ఇన్విజిబుల్ పోలీస్ విధానం అవలంభించాలన్నారు. రాజకీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను అడ్డుకోవడంపై పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, తుని ఘటన, విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలు అలాంటివేనని సీఎం అన్నారు. పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం ప్రజల కోసం అంకితం చేయడం గొప్పసేవానిరతి అన్నారు. పోలీసులకు కుటుంబం కంటే ప్రజాసేవ అంటేనే ఇష్టం అని, అలాగే ‘ప్రజల భద్రతే మా ధ్యేయం.. ఫ్రెండ్లీ పోలీసింగే మా లక్ష్యం’ అని సీఎం అన్నారు.
దేశ వ్యాప్తంగా 414 మంది, రాష్ట్రవ్యాప్తంగా 6గురు పోలీసులు విధినిర్వహణలో మరణించారని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.