Published: 21-10-2018

నేడు జనసేన కార్యకర్తలతో పవన్‌కల్యాణ్ సమావేశం

విశాఖపట్టణం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆపార్టీ కార్యకర్తలతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ మలివిడత పర్యటన విశాఖ జిల్లాలో జరగనుంది. అయితే... ఈ పర్యటనపై చర్చించేందుకు ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి పర్యటన ప్రారంభించాలి.., ఎక్కడితో ముగించాలి.. అన్న విషయాలపై పవన్ చర్చించనున్నారు.