Published: 18-10-2018
తితలీ బాధితులకు అమరావతి జేఏసీ చేయూత

అమరావతి: తితలీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరిగిన నష్టానికి ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించినట్లు అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను కలసి విరాళం మొత్తాన్ని ఈ నెల జీతం నుంచి తగ్గించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరినట్లు వారు చెప్పారు. చివరి తరగతి ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల నుంచి రూ. రెండు వందలు, మిగిలిన అన్ని క్యాడర్ల సిబ్బంది, ఉపాధ్యాయుల నుంచి రూ.ఐదు వందలు ఇస్తున్నట్లు వారు తెలియజేశారు.
