Published: 04-10-2018

రోగులకు డైట్‌......ఖర్చూ సర్కారుదే

అమరావతి,: రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు డైట్‌ చార్జీలతో పాటు ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు ప్రొఫెసర్‌ బృందం, సూపరింటెండెంట్‌లకు అందించే ఇన్సెంటివ్‌లోనూ మార్పులు చేశారు. గతంలో సూపరింటెండెంట్‌ రూ.50 వేలకుమించి తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు, దీనిని రూ.1.50 లక్షలకు ప్రభుత్వం పెంచింది.