Published: 26-09-2018
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో హైటెన్షన్

విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. సరిహద్దుల్లో ఏపీ, ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈరోజు డీజీపీ ఆర్పీ ఠాకూర్ విశాఖ రానున్నారు. మరోవైపు వీడియో దృశ్యాల ఆధారంగా కిడారి, సోమ హత్యలపై సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఈ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులను సిట్ బృందం విచారిస్తోంది. డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హత్య అనంతరం సేకరించిన ఆధారాలు, వీడియో ఫుటేజీలను పరిశీలిస్తోంది. మావోయిస్టులు సెల్‌ఫోన్లు, వాకీటాకీలు వాడినట్టు గుర్తించిన సిట్ బృందం కాల్‌డేటాను పరిశీలిస్తోంది. హత్యలకు సంబంధించి ఈరోజు మరికొంతమందిని సిట్ బృందం విచారించనుంది.
