Published: 19-09-2018
స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు పరిశీలన

విజయవాడ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బైపీసీ స్ర్టీమ్ కోర్సుల స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను మంగళవారం పరిశీలించారు. 1,670 నుంచి 29,953 వరకు ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను పరిశీలించినట్లు కౌన్సెలింగ్ సమన్వయకర్త డాక్టర్ ఎ.శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జె.కృష్ణప్రసాద్, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
