Published: 18-09-2018
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల ముందస్తు అరెస్ట్

విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాల నుంచి వస్తున్న పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీకి ఆందోళనకారుల ఏర్పాట్లు చేయడంతో రైల్వేస్టేషన్, బస్టాండ్ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
