Published: 17-09-2018
భీమిలి నియోజకవర్గంలో జగన్ యాత్ర

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం భీమిలి నియోజకవర్గంలో సాగింది. ఆనందపురం మండలం దబ్బంద గ్రామం వద్ద ఉదయం పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్తరవు జంక్షన్, నారాయణగజపతిరాజుపురం, మామిడిలోవ, శొంఠ్యాం, గొంతినవానిపాలెం, గుమ్మడివానిపాలెం, దిబ్బడిపాలెం గ్రామాల మీదుగా సాగారు. నీలకుండీల జంక్షన్‌లో రాత్రి బస చేశారు. సుమారు 10 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ సందర్భంగా విధ వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. జగన్ వారి నుంచి వినతులు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు జగన్‌కు స్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
