Published: 16-09-2018
చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి..

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు శనివారం శ్రీకాకుళం వెళ్లిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కావలి ప్రతిభాభారతి, విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ దూబ ధర్మారావు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. సీఎం కాన్వాయ్‌ను ఆనుకొని వీరి వాహనాలు వెళ్తుండగా మధ్యలో పోలీసు ఎస్‌కార్ట్‌కు చెందిన జీపు అడ్డంగా దూరడంతో కార్లన్నీ ఒక్కసారి ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కార్లు కొంత వరకు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
