Published: 16-09-2018

రోడ్డుపై బైఠాయించిన జేసీ దివాకర్‌‌రెడ్డి..

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం చిన్నపొడమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఇందుకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నపొడమలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానందస్వామి వర్గీయులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమాచారం అందుకున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హూటాహుటిన గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీసులు పెద్దఎత్తున ఆ గ్రామంలో మొహరించారు.