Published: 12-09-2018
పోలవరం పర్యటనలో అపశృతి

ప.గో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం 8 బస్సుల్లో ప్రజాప్రతినిధులు పోలవరం యాత్రకు బయలుదేరి వెళ్లారు.
