Published: 12-09-2018
వికాస్ జాబ్ ఫెయిర్‌కు విశేష స్పందన

-
విజయవాడ: విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ విద్యా సంస్థల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) వికాస్ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్‌కు విశేష స్పందన వచ్చింది. 2014 నుంచి 2018 వరకు డిగ్రీ, ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొందిన సుమారు 780 మంది అభ్యర్థులు మెగా జాబ్ ఫెయిర్‌కు హాజరయ్యారు. లుక్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ద్వారా ఏపీఐటీఏ అన్ని జిల్లాల్లో మెగా జాబ్ ఫెయిర్‌లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నున్న వికాస్‌లో మంగళవారం జాబ్ ఫెయిర్‌ను నిర్వహించింది.టెక్ మహీంద్ర, ఎప్ ట్రానిక్స్, అపోలో ఫార్మశీ, ఫ్లెక్స్ ట్రానిక్స్ తదితర 23 కంపెనీలు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా హాజరైన నిరుద్యోగ అభ్యర్థులకు రాత, మౌఖిక, ఇంటర్వ్యూ విధానంలో ఎంపికలు నిర్వహించారు. మెగా జాబ్ ఫెయిర్‌ను వికాస్ విద్యాసంస్థల కార్యదర్శి నరెడ్ల సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీఐటీఏ ద్వారా జాబ్ ఫెయిర్ నిర్వహించే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ్థతో కలిసి ఏపీఐటీఏ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
