Published: 11-09-2018

పెట్రోల ధరల తగ్గింపు సాహసోపేతం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలకోట్ల ఆర్ధికలోటులో ఉన్నా పెట్రోధరల తగ్గింపు సాహసోపేతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ స్ట్రాటజీ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ప్రజలే ముందు (పీపుల్ ఫస్ట్)' అనేది టీడీపీ నినాదమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 తగ్గింపు పేదలకెంతో ఊరట నిచ్చిందని...కేంద్రంలో ఆ మాత్రం ఉదారం కూడా లేకపోవడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, విప్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.