Published: 29-08-2018
దుర్గగుడి హుండీల ఆదాయం రూ. 2.56 కోట్లు

విజయవాడ: దుర్గామ ల్లేశ్వరస్వామి దేవ స్థానం కనకదుర్గ మ్మను దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని హుం డీలలో సమర్పించిన కానుకలను రెండు రోజుల పాటు లెక్కించగా రూ. 2,56,84,0 17ల ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈవో వి.కోటేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం మహా మండపంలో 27 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు 14 హుండీలలో సమర్పించిన కానుకలను ఈవో పర్యవేక్షణలో ఉద్యోగులు లెక్కించారు. 14 హుండీలలో కానుకలను లెక్కించగా రూ. 54,78,230లు లభించినట్లు తెలిపారు. 43 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ 452 గ్రాముల వెండి ఆభరణాలు భక్తులు సమర్పించారని పేర్కొ న్నారు. మొదటి రోజు 19 హుండీలలో కానుకలు లెక్కించగా రూ. 2,02,05,787లు, 764 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 కే జీల 635 గ్రాముల వెండి ఆభరణ లభించినట్లు ఈవో తెలిపారు.
