Published: 27-08-2018
కేరళ బాధితులకు రైల్వే ఉద్యోగుల సాయం

విజయవాడ: కేరళ వరద బాధితుల కోసం రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు ఉద్యోగులు తమ వంతు సాయంగా నిత్యావసర వస్తువులను అంద జేశారు. వర్క్‌షాపులోని ఎంప్లాయీస్ సంఘ్, మజ్దూర్ యూనియన్, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అసోసియేషన్ నాయకులు, కార్మికులు వస్తు సామగ్రి కొనుగోలు చేసి విజయవాడ రైల్వే పార్శిల్ కార్యాలయంలో ఆదివారం అందజేశారు. సీడబ్ల్యూఎం బీరేందర్ సింగ్, డిప్యూటీ సీఎంఈ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యం లో కార్మిక సంఘ నాయకులు సామగ్రిని ఆదివారం అందించినట్లు సంఘ్ సెక్రటరి గద్దా సురేష్ తెలిపారు
