Published: 20-08-2018
ప్రమాదం నీడలో సాగుతున్న జీవితాలు

ఏలూరు/హరిపురం;ఒకటీ రెండూ కాదు.. ఏళ్ల కిందట కట్టిన భవనాలు. గోడలు పగుళ్లు తీశాయి. పైకప్పు శిథిలమయ్యింది. ఎప్పుడు కూలతాయో తెలియని స్థితిలో వందలాది ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు ఉన్నాయి. అసలే వర్షాకాలం. రోజుల తరబడి వానలు పడుతున్నాయి. శిథిలమైన గోడలు.. పైకప్పు వానలకు నాని పోయి ఉన్నాయి. ఏ క్షణాన ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. శుక్రవారంనాడు తూర్పు గోదావరి జిల్లాలోని సబ్ ట్రెజరీ కార్యాలయ భవనం కూలిపోయి ఓ మహిళా ఉద్యోగిని చనిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం కూలడానికి సిద్ధంగా ఉంది. పెంటపాడు మండల పరిషత్ కార్యాలయం ఓ పక్కకు ఒరిగిపోయిం ది. తణుకు తహసీల్దార్ కార్యాలయంలో వర్షం పడితే తడిసిపోవల్సిం దే.
