Published: 16-08-2018
18, 19 తేదీలలో పలు రైళ్ల రద్దు

ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడ -ముస్తాబాద్ సెక్షన్ల మధ్యన ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరే గుంటూరు - నరసాపూర్ ప్యాసింజర్ రైలు, సాయంత్రం 8.10కి బయలుదేరే గుంటూరు - విజయవాడ డెమూ రైలుని రద్దు చేస్తున్నామన్నారు. 19న నరసాపూర్ - గుంటూరు ప్యాసింజర్ రైలు రద్దు చేస్తోన్నట్లు తెలిపారు. అలానే నరసాపూర్ - గుంటూరు డెమూ ప్యాసింజర్‌ని ఈ నెల 18న రామవరప్పాడు వరకే నడుపుతామన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
