Published: 13-08-2018
రైల్వేజోన్ కోసం దివ్యాంగుడి సైకిల్ యాత్ర

ఇచ్ఛాపురం :రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ.. ఓ దివ్యాంగుడు శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతికి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్ ఆదివారం ఇచ్ఛాపురంలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్‌యాత్ర ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు హోదాతో పాటు రైల్వేజోన్ ఇవ్వాలని వినతిపత్రం అందజేస్తానన్నారు.
