Published: 07-08-2018
రబీ బీమా ‘పంటలు’ ఖరారు

రబీ సీజన్ (2018-19)లో రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్), ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై) కింద ఏ జిల్లాలో ఏ పంటకు బీమా అందించాలనే అంశం ఖరారైంది. ఇటీవల సచివాలయంలో జరిగిన పంటల బీమాకు సంబంధించిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రెండు బీమా పథకాలను అవాంతరాలు లేకుండా అమలుచేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది
