Published: 27-07-2018

విలువైన వజ్రం చోరీ.

ఆ వజ్రం విలువ రూ. 137కోట్లు! ఇది దుబాయ్‌లోని ఓ కంపెనీ నుంచి చోరీకి గురైంది. దొంగలు వజ్రాన్ని ఓ షూ బాక్స్‌లో పెట్టి శ్రీలంకకు అక్రమంగా తరలించారు. కంపెనీకి చెందిన గార్డు దీన్ని మే 25న తస్కరించి తన బంధువుకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంతోమందిని విచారించి వందల గంటలపాటు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి నిందితుడిని గుర్తించి ఎట్టకేలకు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.