Published: 24-07-2018
బందర్ కి క్రికెటర్ కుంబ్లే ...

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో తొలి అథ్లెటిక్ మైదానానికి మచిలీపట్నం వేదిక కాబోతోంది. రూ.15కోట్లతో నిర్మించనున్న మైదానం పనులకు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేడు శంకుస్థాపన చేయనున్నారు. భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఎందరో క్రీడాకారులను పుట్టినిల్లు అయిన మచిలీపట్నంలో ఇప్పటివరకు క్రీడాపరమైన వసతులు లేదని ఆ కొరత తీర్చేలా మైదానాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని కోచ్‌లు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
