Published: 22-07-2018
‘ప్రధాని మోదీ నిజస్వరూపం

విశాఖపట్టణం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజస్వరూపం బయటపడిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ హామీ ఇచ్చారన్నారు. అనంతరం ఏపీకిచ్చిన హామీలను ప్రధాని మోదీ మరచిపోయారని, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు పోరాడిన తీరు అభినందనీయమన్నారు. అలాగే సభలో ప్రధాని మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారని, ఏపీపై ప్రధాని మోదీ వ్యంగ్యంగా మాట్లాడారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకతీతంగా పోరాడాలని గంటా అన్నారు.
