Published: 21-07-2018

ఆంధ్రాకు అసలైన ద్రోహులెవరో తేలిపోయింది

అమరావతి: ఆంధ్రాకు అసలైన ద్రోహులెవరో నిన్నటితో తేలిపోయిందని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ అవిశ్వాసం పెట్టడం బాధాకరమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని లోక్‌సభలో తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏపీ ఏది అడిగినా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురందేశ్శరి స్పష్టం చేశారు. ఆనాడు రాష్ట్రాన్ని విభజించమని చంద్రబాబు లేఖ ఇచ్చింది నిజంకాదా? అని ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పురందేశ్వరి ఆరోపించారు.