Published: 14-07-2018

వేద విద్యతో విదేశాల్లో జీవనం

సాధారణంగా చాలామంది సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాల్లో ఉన్నత చదువులు చదివి వాటిలొ రాణించాలని విదేశాలకు తరలివెళ్తున్నారు. కొందరు అక్కడే స్థిరపడుతున్నారు. అందుకు భిన్నంగా కులవృత్తితో విదేశాలకు వెళ్లి జీవిస్తున్న వారు చాలా అరుదు. ఆ కోవలోని వాడే దుర్భాకుల కళ్యాణకుమార్‌. తమ వంశ పారంపర్యంగా వస్తున్న పౌరోహిత వృత్తిలో బాగా పట్టు సంపాదించి అమెరికాలో స్థిరపడ్డాడు. తల్లితండ్రుల ప్రోత్సాహం, స్నేహి తుల సహకారం అతడికి తోడ్పడింది.
మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లికి చెందిన శాంతారామ్‌, తులసీ దంపతులది సామాన్య బ్రాహ్మణ కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు కళ్యాణ్‌కుమార్‌, రామకృష్ణ. తండ్రి శాంతారామ్‌ వంశ పారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యాన్ని స్థానికంగా కొనసాగిస్తున్నాడు. తల్లి తులసి చీరలు వ్యా పారం చేస్తూ తనవంతుగా కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పెద్దకుమారుడు కళ్యాణ్‌కు మార్‌ స్థానిక పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. రెండో కుమారుడు రామకృష్ణ పదో తరగతి పూర్తి చేశాడు.
 
కుమారులను ఉన్నత చదువులు చదివించ డానికి ఆ దంపతులకు ఆర్థిక సమస్య ఎదురైంది. తమ కుమారులను చదువులు మాన్పించి తమ కులవృత్తి అయిన పౌరోహిత్యం వైపు మళ్లించారు. అయినప్పటికీ సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఎలాగైనా నమ్ముకున్న వృత్తిలోనే బాగా రాణించాలన్న ఆలో చన కళ్యాణ్‌కుమార్‌కు తట్టింది. అనుకున్నదే తడువుగా అనుభవజ్ఞులతో చర్చించి వైదిక విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంలో తిరుపతి శ్రీవెంకటేశ్వర వేద విజ్ఞాన పీ ఠంలో సీటుకోసం పరీక్ష రాశాడు. ఉత్తమ ప్రతిభ ను చాటడంతో అందులో సీటు లభించింది. 2002నుంచి ఐదేళ్ల పాటు అక్కడ చదివిన తర్వాత శ్రీవెంకటేశ్వర వేదిక్‌ యూనివర్శిటీలో మూడేళ్ల బీఏ డ్రిగీలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి చేరుకుని యాగా లు, శుభకార్యాలు చేయించేవాడు.
 
స్థానికంగా పౌరోహిత్యం చేస్తున్న కళ్యాణ్‌ కుమార్‌ తనతోపాటు వేదవిద్యను చదివిన మి త్రుల సలహాతో అవెెురికాలో ఉన్న పలు ఆల యాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడి నుంచి కళ్యాణ్‌కుమార్‌కు ఏడుగురు స భ్యులతో కూడిన ఓ ఆలయ కమిటీ ఆన్‌లైన్‌లోనే ఇంటర్వూ నిర్వహించింది. స్థానికంగా కళ్యాణ్‌ కుమార్‌ స్థితిగతులు, వృత్తిలో నైపుణ్యం గ్రహిం చిన కమిటీ అమెరికాలో పౌరోహిత్యానికి ఆహ్వా నం అందింది. 2015లో ఆ యువకుడు అమెరికా లోని మేరీల్యాండ్‌, జర్మన్‌ టౌన్‌లో ఉన్న షిరిడీ సాయిబాబా, సీతారాములు, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అర్చకుడిగా చేరాడు. మూడేళ్లుగా అక్కడ పౌరోహిత్యంలో రాణిస్తూ భార్య నిత్యశ్రీ, 5నెలల బాలుడు శివకార్తికేయతో కలసి జీవిస్తున్నాడు. అమెరికాలో పలు ఆలయాల్లో అ ర్చకుడిగా పని చేస్తున్న కళ్యాణ్‌ కు అక్కడ ఉచిత నివాసం ఏర్పాటు చేశారు. నెలకు 1250 అమె రికన్‌ డాలర్లు ఇస్తున్నారు. ఇండియన్‌ కరెన్సీ ప్ర కారం అక్షరాల రూ.85 వేలు జీతం అం దుకుం టున్నాడు. వేద బ్రాహ్మణ వృత్తిలో ఉంటూ అదికూడా తక్కువ వయస్సులో పెద్ద ఎత్తున పారితోషికాన్ని అందుకొంటుండటం విశేషం.