Published: 12-07-2018
ఆర్టీసీ టికెట్ ధర పెంచొద్దు: అచ్చెన్న

అమరావతి : ప్రయాణ టికెట్ల ధరలు పెంచకుండా ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, చైర్మన్ వర్ల రామయ్యతో బుధవారం మంత్రి సమీక్షించారు. వేతన సవరణ, ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందన్న అంశాలపై చర్చించిన అచ్చెన్న నివేదిక సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.
