Published: 10-07-2018
ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం

ఆత్మకూరు: చేయి విరిగిందంటూ వచ్చిన ఓ రోగి పట్ల ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేవూరుకు చెందిన ఏడుకొండలు అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు చేయి విరిగింది. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు ఏడుకొండలుకు వైద్యం చేసేందుకు నిరాకరించారు. పైగా ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవాలంటూ వైద్యులు సూచించారు. ఏడుకొండలు బతిమిలాడినప్పటికీ వైద్యులు వినిపించుకోకుండా అతడిని బలవంతం డిశ్చార్జ్ చేశారు. వైద్యుల తీరుపై ఏడుకొండలు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
