Published: 20-06-2018
రవాణా శాఖలో అవినీతికి తావు లేదు

రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాజధానిలోని మందడం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ‘మీ ముగింట్లో రవాణాశాఖ’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వంద మందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు అందజేసారు. అలాగే 13 జిల్లాల రవాణాశాఖ అధికారులకు అత్యాధునిక స్పీడ్‌గన్‌లను, పోలీసు అధికారులకు బ్రీత్ ఎన్‌లైజర్లను అందజేసారు.
