రెండు రోజుల తర్వాత మళ్లీ తగ్గిన పెట్రోల్ ధర

రెండు రోజుల తర్వాత మళ్లీ తగ్గిన పెట్రోల్ ధర దిల్లీ: గత రెండు రోజులుగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్న పెట్రోల్ ధర శుక్రవారం కాస్త తగ్గింది. లీటర్ పెట్రోల్‌పై 8 పైసలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు నేడు ప్రకటించాయి. ఈ ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. మరోవైపు డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. వరుసగా మూడో రోజు డీజిల్ ధరను స్థిరంగా ఉంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇండియన్ ఆయిల్ ధరల ప్రకారం.. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ. 76.35గా ఉంది. ముంబయిలో రూ. 84.18, చెన్నైలో రూ. 79.24, కోల్‌కతాలో రూ. 79.02గా ఉంది. ఇక డీజిల్‌పై మంగళవారం నాటి ధరలే కొనసాగుతున్నాయి. లీటర్ డీజిల్ ధర దిల్లీలో రూ. 67.85, ముంబయిలో రూ. 72.24, చెన్నైలో రూ. 71.62, కోల్‌కతాలో రూ. 72.24గా ఉంది. మే 14 నుంచి 29 మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశ్నాంటిన విషయం తెలిసిందే.
ఈ మొత్తం రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరపై దాదాపు రూ. 4 వరకు పెరిగింది. అయితే మే 29 తర్వాత వరుసగా 14 రోజుల పాటు స్వల్పంగా పాటు తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. తాజాగా శుక్రవారం స్వల్పంగా తగ్గింది.
