Published: 12-06-2018

తొలిసారి కలుసుకున్న ట్రంప్, కిమ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ నేడు సమావేశమమ్యారు. సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌లో ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకున్నారు. ఈనాటి వరకూ ట్రంప్‌, కిమ్‌లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు. ప్రస్తుతం ఇద్దరూ చర్చలు సాగిస్తారని ఎవరూ ఊహించలేదు. అందుకే వీరి సమావేశంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కొద్దిసేపట్లో వెల్లడికానుంది.