Published: 03-06-2018
పర్యావరణ పరిరక్షణపై ఆన్‌లైన్ వీడియోగేమ్ పోటీలు

విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు బబుల్‌ఫిల్మ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఒయాసిస్ పాఠశాల విద్యార్థులకు శనివారం షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎకో ఫిల్మ్‌ఫెస్ట్ పేరుతో బిట్‌ప్లాస్టిక్ పొల్యూషన్‌పై ఆన్‌లైన్ వీడియో గేమ్ పోటీలు నిర్వహించింది. సంస్థ నిర్వాహకుడు గంగాధర్ పాండే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సింగపూర్‌కు చెందిన ఎన్‌జీవో డెరేక్ ట్యాన్, చైనాకు చెందిన సివింగ్ వ్యాంగ్ పర్యవేక్షించగా, చిన్నారి హరిఓం ఇన్‌చార్జిగా వ్యవహరించారు
