Published: 01-06-2018
సీతను రాముడు అపహరించాడు.

సీతను ఎవరు అపహరించారు? అంటే చిన్న పిల్లవాడు కూడా రావణుడు అంటూ సరైన జవాబు చెబుతాడు. కానీ గుజరాత్ బోర్డు విడుదల చేసిన 12వతరగతి సంస్కృత పాఠ్యపుస్తకంలోని రామాయణం పాఠంలో రాముడే సీతను అపహరించాడని ముద్రించారు. ఇది శుద్ధ తప్పనే ప్రాథమిక వాస్తవం తెలిసినా గుజరాత్ సంస్కృత పాఠ్యపుస్తకంలోని 106 వ పేజీలోని ‘రఘువంశం’ పాఠంలో ఈ తప్పును ముద్రించారు. ఈ తప్పు విషయమై గాంధీనగర్ గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్ట్స్ బుక్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్ పెథన్ ను సంప్రదించగా పొరపాటును అంగీకరించాడు.అనువాద లోపం వల్ల సంస్కృత పాఠ్యపుస్తకంలో ఇలా తప్పు జరిగిందని నితిన్ చెప్పారు. కాని గుజరాతీ భాషలోని పాఠ్య పుస్తకంలో ఏ తప్పు లేదని నితిన్ వివరించారు.
