Published: 26-05-2018

కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

 జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర చర్యను భద్రతాసిబ్బంది భగ్నం చేశారు. సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపి వారిని హతమార్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

కుప్వారా జిల్లాలోని తాంగ్‌ధార్‌ సెక్టార్ ప్రాంతం‌లో కొందరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి దేశంలో చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కలియా తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించా