Published: 16-05-2018

తితిదే ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు..... సంచలన వ్యాఖ్యలు!!!

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నేతలే భ్రష్టుపట్టిస్తున్నారని తితిదే ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదాన్ని వ్యాపారమయంగా మార్చుతున్నారని విమర్శించారు. 1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ఒక్కసారిగా రద్దు చేసిందని, అందుకు గల కారణాలు విస్పష్టమని అన్నారు. అధికారులు కూడా స్వామి వారి కైంకర్యంలో జోక్యం చేస్తున్నారని, ఈ విషయమై అర్చకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు స్వామి వారికి జరగాల్సిన ఆరాధనలు సక్రమంగా జరగకపోవడం వల్ల ఆయనకు ఆగ్రహం వస్తుందనేది అగమవాక్యమని చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే స్వామి వారి ఆభరణాల గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజకీయ నేతల నాయకుల కబంధహస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని చెన్నైలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.Image result for ttd laddu making images